రెమ్‌డిసివిర్‌ బ్లాక్‌మార్కెట్‌పై నిరసన

ABN , First Publish Date - 2021-04-29T04:44:07+05:30 IST

రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తుండటంపై ఆస్రా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు బుధవారం వీఆర్‌సీ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

రెమ్‌డిసివిర్‌ బ్లాక్‌మార్కెట్‌పై నిరసన
నిరసన తెలుపుతున్న సమితి నేతలు

నెల్లూరు(వైద్యం)ఏప్రిల్‌ 28 : రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తుండటంపై ఆస్రా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు బుధవారం వీఆర్‌సీ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శివలంకి సుధీర్‌బాబు మాట్లాడుతూ కరోనా బాధితులకు రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉందన్నారు. దాని అసలు ధర రూ. 3,490 ఉండగా బ్లాక్‌ మార్కెట్‌లో రూ. 35 వేల నుంచి రూ. 40 వేల వరకు విక్రయిస్తున్నారన్నారు. కరోనా భయాన్ని ఆసరా చేసుకుని  ఈ బ్లాక్‌ మార్కెట్‌ దందా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఔషధ నియంత్రణ శాఖ తీరు వల్ల ఈ బ్లాక్‌ మార్కెట్‌ పెరుగుతున్నట్లుందన్నారు. రెడ్‌క్రాస్‌ ద్వారా రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబీ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-29T04:44:07+05:30 IST