ప్రైవేటీకరణ వద్దే వద్దు!
ABN , First Publish Date - 2021-12-16T04:14:29+05:30 IST
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో ఉద్యోగులు సమ్మెబాటప ఉడుతున్నారు.

నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
జిల్లావ్యాప్తంగా బ్యాంకు సేవలకు ఆటంకం
నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 15 : బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో ఉద్యోగులు సమ్మెబాటప ఉడుతున్నారు. దీంతో జిల్లాలోని అన్ని పబ్లిక్ రంగ బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉద్యోగులు ఈ సమ్మెకు పూనుకొంటున్నారు. దేశంలో పబ్లిక్ రంగ బ్యాంకులు ప్రజా సంక్షేమ పథకాలకు, వ్యవసాయ, చిన్నతరహా వాణిజ్యం, చిన్న తరహా వ్యాపారం, రవాణా రంగ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళితే ప్రజాధనానికి భద్రత ఉండదని, ఉద్యోగ భద్రత ఉండదని, ఆనలైన సేవలపై ప్రత్యేక వడ్డింపులు ఉంటాయని బ్యాంకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాల్లో కనీస నిల్వలు భారీగా పెరిగిపోయి, ప్రతి సేవకు పన్నులు, డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిపోతాయని వారంటున్నారు. తక్కువ వడ్డీకి గృహ, విద్యా రుణాలు ఇవ్వరని, ఉచిత సేవలకు మంగళంపాడి రైతులకు రుణాలు ఇవ్వరని ఆవేదన చెందుతున్నారు. ఇలా జాతీయ బ్యాంకులు ప్రైవేటు పరమైతే కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ బ్యాంకు ఉద్యోగులు జిల్లాలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స ఆధ్వర్యంలో సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు.
మూతపడునున్న 372 శాఖలు
జిల్లాలో పబ్లిక్ రంగంలో ప్రధాన బ్యాంకులు, వాటి బ్రాంచీలు 372 ఉండగా, ప్రతిరోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. రెండురోజులపాటు సమ్మె జరిగితే బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా స్తంభించి, ఖాతాదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించిన 572 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటి సేవలకు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది.
ప్రజా క్షేమం కోసమే
పబ్లిక్ రంగ బ్యాంకుల వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ను కేంద్రం ప్రవేశ పెట్టబోతోంది. ఇందులో పబ్లిక్ రంగ బ్యాంకుల ప్రవేటీకరణ బిల్లు కూడా ఉండనుంది. పబ్లిక్ రంగ బ్యాంకుల ప్రైవేటీ కరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజా క్షేమం కోసమే సమ్మె చేస్తున్నాం.
- వి.ఉదయకుమార్, యూఎ్‌ఫబీయూ, జిల్లా కన్వీనర్
ఏటీఎంలు పని చేస్తాయి
బ్యాంకు ఉద్యోగులు గురు, శుక్రవారాల్లో సమ్మె చేస్తున్నారు. అయితే, ఏటీఎంలు మాత్రం పని చేస్తాయి. ప్రజలు ఏటీఎం, ఆనలైన సేవలను వినియోగించుకోవచ్చు.
- రాంప్రసాద్‌రెడ్డి, ఎల్‌డీఎం