ప్రతి విషయం ఎంపీపీకి చెప్పాల్సిందే..

ABN , First Publish Date - 2021-12-20T04:47:01+05:30 IST

ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి ప్రతి విషయం ఎంపీపీకి చెప్పి తీరాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఎంపీడీవో వెంకటేశ్వర్లు మండల సర్వసభ్య సమావేశంలో హుకుం జారీ చేశారు.

ప్రతి విషయం ఎంపీపీకి చెప్పాల్సిందే..
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ గుండాల వజ్రమ్మ

  సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో 


మనుబోలు, డిసెంబరు 19: ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి ప్రతి విషయం ఎంపీపీకి చెప్పి తీరాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఎంపీడీవో వెంకటేశ్వర్లు మండల సర్వసభ్య సమావేశంలో హుకుం జారీ చేశారు.  మండల పాలకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుండాల వజ్రమ్మ మాట్లాడుతూ అధికారులు. ప్రజాప్రతినిఽధులు సమన్వయంతో సహకరించుకుంటే మండలంలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందరికి చేరుతాయన్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి  సర్వసభ్య సమావేశం ఉంటుందని, సభ్యులు చెప్పిన సమస్యలను వచ్చే సమావేశంలోపు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా  ఈ సమావేశంలో  వడ్లపూడి ఎంపీటీసీ ఉన్నం లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ అక్కంపేట పంచాయతీకి కార్యదర్శి ఎవరని ఎంపీడీవోని ప్రశ్నించారు. అలాగే జగనన్న ఇళ్ల గురించి, పర్లపాడులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. అనంతరం మనుబోలు ఉప సర్పంచి కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి ఆర్టీసీకి సంబంధించి సమావేశానికి ఒక్కరూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుబోలు గ్రామంలోకి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడపాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ, ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ వెంకట సుబ్బయ్య యాదవ్‌, చందన, రాజేశ్వరి, కల్పన, శిరీష, రాగయ్య, సుజాతమ్మ, మమత, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-20T04:47:01+05:30 IST