ప్రసన్న వల్లే పొర్లుకట్టల ధ్వంసం

ABN , First Publish Date - 2021-12-20T04:55:08+05:30 IST

ఇసుక మాఫియాతో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి జతకట్టడం వల్లే పల్లెపాడు పొర్లుకట్టలు ధ్వంసమయ్యాయని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

ప్రసన్న వల్లే పొర్లుకట్టల ధ్వంసం
సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

ఇసుక మాఫియాకు అండ

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి ధ్వజం


ఇందుకూరుపేట, డిసెంబరు 19 : ఇసుక మాఫియాతో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి జతకట్టడం వల్లే పల్లెపాడు పొర్లుకట్టలు ధ్వంసమయ్యాయని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని పల్లెపాడులో నిర్వహించిన గౌరవ సభ కార్యక్రమంలో    పోలంరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ పొర్లుకట్టను వెంటనే సరిదిద్దకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, దానికి వైసీపీ బాధ్యత వహించాలని అన్నారు. పల్లెపాడు అభివృద్ధిలో గత ప్రభుత్వంలో చేసిన పనులు తప్ప నేడు సాధించింది ఏమీ లేదన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఇసుక మాఫియా నేడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని.. అందుకు ఎమ్మెల్యే ప్రసన్న అండదండలు ఉండడం కోవూరు ప్రజలు చేసుకున్న దురదృష్టమని విచారం వ్యక్తం చేశారు. పల్లెపాడులో  నేటికీ కూడా పొర్లుకట్టని పటిష్ట పరిచే కార్యక్రమం చేపట్టపోవడం ఎమ్మెల్యే నిర్లక్ష్యవైఖరిని తెలియజేస్తుందని పేర్కొన్నారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ ఇస్తున్నానని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు టీడీపీ కార్యకర్తలు విశ్రమించకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకుడు చింతపండు వెంకట రమణయ్య అధ్యక్షత వహించగా.. వీరేంద్రచౌదరి, మునగాల రంగారావు, చెంచుకిషోర్‌యాదవ్‌, రాంప్రసాద్‌, కొత్తూరు రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-12-20T04:55:08+05:30 IST