ప్రాంగణ ఎంపికల్లో 91 ఎంపిక

ABN , First Publish Date - 2021-11-10T03:16:45+05:30 IST

మండలంలోని విద్యానగర్‌లో గల ఎన్‌బీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో టీసీఎస్‌ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 91 మంది

ప్రాంగణ ఎంపికల్లో 91 ఎంపిక
మాట్లాడుతున్న డైరెక్టర్‌ డాక్టర్‌ విజయకుమార్‌రెడ్డి తదితరులు

కోట, నవంబరు 9 : మండలంలోని విద్యానగర్‌లో గల ఎన్‌బీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో టీసీఎస్‌ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 91 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు.  ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళవారం డైరెక్టర్‌తోపాటు ఆయా విభాగాధిపతులు విలేకర్లతో మాట్లాడారు. దీనికి ముందు జరిగిన ఇన్ఫోసిస్‌ ప్రాంగణ ఎంపికలలో 60 మంది ఎంపికయ్యారన్నారు. ప్రాంగణ ఎంపికల అధికారి డాక్టర్‌ కిషిందర్‌ మాట్లాడుతూ విప్రోకి 139 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరైనట్లు తెలిపారు. 


Updated Date - 2021-11-10T03:16:45+05:30 IST