ప్రజలపై అధికభారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-20T03:06:42+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధిక విద్యుత్‌చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై అధిక ఆర్ధికభారాన్ని మోపుతుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌

ప్రజలపై అధికభారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం
ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, టీడీపీ నాయకులు


 మాజీ ఎమ్మెల్యే పాశిం

గూడూరు, అక్టోబరు 19: వైసీపీ ప్రభుత్వం అధిక విద్యుత్‌చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై అధిక ఆర్ధికభారాన్ని మోపుతుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ విమర్శించారు. మంగళవారం మండలంలోని విందూరు, రామలింగాపురం గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహిస్తూ విద్యుత్‌ చార్జీల పెంపుపై ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్‌చార్జీలు పెంచమని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేపట్టిన తరువాత ట్రూఆప్‌చార్జీల పేరుతో విద్యుత్‌బిల్లులను వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలాను గ్రామీణ ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం తీసుకువచ్చేలా టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్‌రెడ్డి, కొండూరు వెంకటేశ్వ ర్లురాజు, మట్టం శ్రావణి, బిల్లు చెంచురామయ్య, దుద్దా రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, ఇస్రాయిల్‌కుమా ర్‌, శ్యామల, భారతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T03:06:42+05:30 IST