ప్రభుత్వ నిర్లక్ష్యానికి భారీ మూల్యం
ABN , First Publish Date - 2021-05-09T03:53:23+05:30 IST
ప్రభుత్వం నిర్లక్ష్యానికి రాష్ట్రంలోని ప్రజలు భారీమూల్యం చెల్లించుకోవాల్సివస్తోందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్
గూడూరురూరల్, మే 8: ప్రభుత్వం నిర్లక్ష్యానికి రాష్ట్రంలోని ప్రజలు భారీమూల్యం చెల్లించుకోవాల్సివస్తోందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ విమర్శించారు. కరోనా వ్యాక్సిన్ వేసి ప్రాణాలను కాపాడాలంటూ శనివారం ఆయన నివాసంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం వలనే విఫత్కర పరిస్థితులు ఏర్పడి ఎంతో మంది మృతిచెందారన్నారు. 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు. ఆక్సిజన్ కొరత వలన ఎంతో మంది ప్రాణాలు విడిచారన్నారు. పొరుగు రాష్ట్రాలు టీకాల కొనుగోలుకు పోటీపడుతుంటే మన ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేందుకు పోటీ పడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఫలితంగా నేడు గూడూరు ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి వెంటనే టీకాలు వేయించాలన్నారు. వాయువు ఇవ్వండి ఆయువు కాపాడండి...మాటలు కాదు మనుషుల ప్రాణాలు కాపాడండి అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.