ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ABN , First Publish Date - 2021-10-20T04:48:10+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, విస్తృత ప్రచారం చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
దండును అభినందిస్తున్న మాజీమంత్రి సోమిరెడ్డి

మాజీ మంత్రి సోమిరెడ్డి 


ముత్తుకూరు, అక్టోబరు 19: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, విస్తృత ప్రచారం చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తనను కలిసిన ముత్తుకూరు మండల నాయకులతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన దండు శ్రీనివాసులును అభినందించారు. అనంతరం తెలుగు యువత మండల అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి ఆధ్వర్యంలో సోమిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పార్టీని పటిష్టపరచడంలో యువత పాత్ర ప్రధానమన్నారు. గ్రామాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన తెలుగుయువత కార్యవర్గానికి సూచించారు. అభివృద్థి, సంక్షేమ పథకాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.  కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, తెలుగుయువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, నాయకులు సన్నారెడ్డి సురేష్‌రెడ్డి, ఏకొల్లు కోదండయ్య, విష్ణువర్ధన్‌రావు, నన్నం దీనయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T04:48:10+05:30 IST