నీటి ప్రవాహంలో చిక్కిన వృద్ధుడిని కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2021-12-09T04:08:25+05:30 IST

ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక చెట్టు కంపలో ఇరుక్కుని రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొన్న ఓ వృద్ధుడిని నవాబుపేట పోలీసులు కాపాడారు.

నీటి ప్రవాహంలో చిక్కిన వృద్ధుడిని కాపాడిన పోలీసులు

నెల్లూరు(క్రైం) డిసెంబరు 8: ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో  కొట్టుకుపోయి ఒక చెట్టు కంపలో ఇరుక్కుని రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొన్న ఓ వృద్ధుడిని నవాబుపేట పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళితే కోవూరు మండలం  ఇనమడుగు గ్రామానికి చెందిన షేక్‌ కాలేషా మంగళవారం రంగనాయులకుల పేట గుడి వద్ద ప్రమాదవశాత్తు పెన్నా నదిలో దిగి నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాడు. ఓల్డ్‌ చెక్‌ పోస్టు వద్ద పడిపోయిన చెట్టు కంపలో ఇరుక్కొని రాత్రంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాడు. స్థానికుల సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు వెంటనే స్పందించి ఆ వృద్ధుడిని కాపాడి సురక్షతంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.

Updated Date - 2021-12-09T04:08:25+05:30 IST