దుకాణాలపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-11-03T04:21:53+05:30 IST

ఎస్‌ఐ ఎం. మనోజ్‌కుమార్‌ మంగళవారం తన సిబ్బందితో కలసి మండలంలోని పునబాక గ్రామంలో దుకాణాలపై దాడులు చేశారు.

దుకాణాలపై పోలీసుల దాడి
స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లతో ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌

160 గుట్కాల స్వాధీనం 

పెళ్లకూరు, నవంబరు 2 : ఎస్‌ఐ ఎం. మనోజ్‌కుమార్‌ మంగళవారం తన సిబ్బందితో కలసి మండలంలోని పునబాక గ్రామంలో దుకాణాలపై దాడులు చేశారు. తినుగొండ రాజపాపయ్య దుకాణంలో అక్రమంగా నిల్వఉంచిన రూ. 4,150 విలువైన 85 హాన్స్‌, 75 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.  దాడిలో హెడ్‌ కానిస్టేబుల్‌ నరసింహరావు, రైటర్‌ కుమార్‌రాజ, కానిస్టేబుళ్లు సునీల్‌కుమార్‌, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. 

50 గుట్కాల ప్యాకెట్ల స్వాధీనం

చేజర్ల : ఎస్‌ఐ విజయ్‌శ్రీనివాస్‌ మంగళవారం మండలంలోని  ఆదురుపల్లి, మడపల్లి గ్రామాల్లోని పలు దుకాణాల్లో తనిఖీ  చేసి 50కు పైగా చిన్న ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. నిషేధిత గుట్కాలు, ఇతర మాదక ద్రవ్యాలతో కూడి న ఖైనీలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు.

Updated Date - 2021-11-03T04:21:53+05:30 IST