టీడీపీ కార్యాలయ భవనానికి స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-12-27T03:50:17+05:30 IST

రాపూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రకటించారు.

టీడీపీ కార్యాలయ భవనానికి స్థల పరిశీలన
టీడీపీ కార్యాలయానికి స్థలం పరిశీలిస్తున్న కురుగొండ్ల

రాపూరు, డిసెంబరు 26: రాపూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రకటించారు. రాపూరులో ఆదివారం జరిగిన ఓ వివాహానికి హాజరైన ఆయన  రాపూరు నుంచి మద్దెలమడుగు సెంటర్‌ ప్రాంతాల్లో పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. ధనుర్మాసం పూర్తయిన తర్వాత భవన నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటించారు.  దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డి, షేక్‌ ముక్తియార్‌, బోరు శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-27T03:50:17+05:30 IST