పిడుగుపాటుకు మేకల మృతి
ABN , First Publish Date - 2021-10-30T03:21:31+05:30 IST
మండలంలోని కనియంపాడులో పిడుగుపాటుకు గురై శుక్రవారం మూడు మేకలు మృతి చెందాయి.
వరికుంటపాడు, అక్టోబరు 29: మండలంలోని కనియంపాడులో పిడుగుపాటుకు గురై శుక్రవారం మూడు మేకలు మృతి చెందాయి. వివరాల మేరకు.. గ్రామంలోని బిజ్జం చినసుబ్బారెడ్డికి చెందిన మేకలు రోజుమాదిరిగా మేత కోసం గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లాయి. తిరిగి సాయంత్రం నివాసానికి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా అవి పిడుగుపాటుకు గురై మృతి చెందడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని సర్పంచు దిలీప్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.