నేటి నుంచి పెన్షన్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-11-01T05:00:31+05:30 IST

జిల్లాలో సోమవారం నుంచి బుధవారం వరకు సామాజిక పెన్షన్‌ల పంపిణీ జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేవీ సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి పెన్షన్ల పంపిణీ

నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 31 : జిల్లాలో సోమవారం నుంచి బుధవారం వరకు  సామాజిక పెన్షన్‌ల పంపిణీ జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేవీ సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3,59,913 మంది సామాజిక పెన్షనర్లకు రూ. రూ.84.86 కోట్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్‌  అందజేస్తారని తెలిపారు. పెన్షనర్లు ఇంటి వద్దే ఉండి పెన్షన్‌ తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2021-11-01T05:00:31+05:30 IST