పెన్నానదిలో గుర్తు తెలియని మృతదేహం
ABN , First Publish Date - 2021-12-31T03:38:32+05:30 IST
మండలంలోని కుడితిపాలెం పెన్నానది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. ఒడ్డున పురు

ఇందుకూరుపేట, డిసెంబరు 30 : మండలంలోని కుడితిపాలెం పెన్నానది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. ఒడ్డున పురుషుడి శవం ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎవరైనా తెచ్చి వేసారా.. లేక హత్య చేశారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి మృతదేహం పడి ఉన్నా, వీఆర్‌వో రాఘవరెడ్డికు గ్రామస్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. కనీసం పోలీసులకు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేయలేదని వారు చెబుతున్నారు. వీఆర్‌ఏ మొలకయ్య గురువారం ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ఆనంద్ తక్షణం స్పందించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నెల్లూరులోని మార్చురీకి తరలించారు. నదిలో ప్రవాహం లేనందున కొట్టుకురావడం జరగదని, హత్య అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.