వల్లభాయ్‌పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-11-01T03:46:35+05:30 IST

నేటి యువత సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఒకటో పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ అన్నారు. వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా గూడూరు పోలీసులు పట్టణంలో విద్యార్థులతో కలిసి రన్‌ఫర్‌ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు.

వల్లభాయ్‌పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమంలో ఎస్‌ఐలు, విద్యార్థులు

గూడూరు, అక్టోబరు 31: నేటి యువత సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఒకటో పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ అన్నారు. వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా గూడూరు పోలీసులు పట్టణంలో విద్యార్థులతో కలిసి రన్‌ఫర్‌ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ వల్లభాయ్‌పటేల్‌ ఐక్యభారత్‌ నిర్మాణానికి అలుపెరుగని కృషి చేశారన్నారు. దేశానికి ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా విశిష్ట సేవలందించారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు బ్రహ్మనాయుడు, గోపాల్‌, తిరుపతయ్య, అజయ్‌కుమార్‌, ముత్యాలరావు, ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T03:46:35+05:30 IST