దాణా తయారీ కూడా రైతులు తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-26T05:31:44+05:30 IST

పాడి పశువులకు దాణా వినియోగించటం మాత్రమే కాకుండా తయారీ విధానం కూడా రైతులు తెలుసుకోవాలని పశుసంవర్ధక సంచాలకులు డాక్టర్‌ జీ.ప్రసన్నాంజనేయరెడ్డి అన్నారు.

దాణా తయారీ కూడా రైతులు తెలుసుకోవాలి
పశువుల దాణా తయారు చేస్తున్న వ్యవసాయాధికారులు

ఇందుకూరుపేట, ఫిబ్రవరి 25 : పాడి పశువులకు దాణా వినియోగించటం మాత్రమే కాకుండా తయారీ విధానం కూడా రైతులు తెలుసుకోవాలని పశుసంవర్ధక సంచాలకులు డాక్టర్‌ జీ.ప్రసన్నాంజనేయరెడ్డి అన్నారు. ఆత్మ బీటీటీ బ్లాక్‌, ఇందుకూరుపేట వారి సౌజన్యంతో గురువారం ఏరియా వెటర్నరీ హాస్పిటల్‌, ఇందుకూరుపేట పరిధిలో ఉన్న ఆర్‌బీకే, ఇందుకూరుపేట బిట్‌-11/1లో పశు దాణా తయారీ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలు ఇచ్చే పశువులకు ఈ దాణా వాడడం వలన రోజుకు 1 లీటరు నుంచి 2 లీటర్ల పాలు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు శిక్షణ పొంది అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మారుతీదేవి, అగ్రికల్చర్‌ ఏడీ, ఇందుకూరుపేట గూడూరు జయరామయ్య, బీటీటీ, చైర్మన్‌, ఇందుకూరుపేట, తదితర అధికారులు, రైతులు పాల్గొన్నారు. Updated Date - 2021-02-26T05:31:44+05:30 IST