పరిశోధనలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2021-10-30T03:24:41+05:30 IST
పరిశోధనలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని వీఎస్‌యూ కళాశాల ప్రిన్సిపాల్ సుజాఎస్ నాయర్ అన్నారు.
వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాఎస్ నాయర్
వెంకటాచలం, అక్టోబరు 29 : పరిశోధనలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని వీఎస్‌యూ కళాశాల ప్రిన్సిపాల్ సుజాఎస్ నాయర్ అన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో శుక్రవారం బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిలో నాచ్ పునరుత్తేజం అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం బయోకెమిస్ర్టీ విభాగంలో పనిచేస్తున్న సహాయ ఆచార్యులు డాక్టర్ పసుపులేటి అనిల్‌కుమార్ మధుమేహ వ్యాధిపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో పెరుగుదలను నియంత్రించే హార్మోన్ల శాతం ఎక్కువ ఉంటుందని, అది మూత్రపిండాల్లో ఉండే పోడోసైట్స్‌పై పనిచేసి వాటిని నిర్వీర్యం చేస్తాయన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ సీడీసీ డీన్ జీ విజయ్ ఆనంద్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ సీ కిరణ్మయి, అధ్యాపకురాలు సీహెచ్ విజయ, డాక్టర్ మేరీ సందీప, డాక్టర్ చలమచర్ల విజయ, డాక్టర్ శ్రీకన్యారావు, డాక్టర్ త్రివేణి తదితరులున్నారు.