పరీక్షలు వాయిదా వేసేలా బుద్ధి ప్రసాదించాలని వినతి

ABN , First Publish Date - 2021-05-03T03:19:31+05:30 IST

పది, ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేసేలా సీఎం జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని ఆదివారం స్థానిక అంబేద్కర్‌నగర్‌ సమీపంలోని వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఏ

పరీక్షలు వాయిదా వేసేలా బుద్ధి ప్రసాదించాలని వినతి
వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలుపుతున్న ఏబీవీపీ నాయకులు

గూడూరురూరల్‌, మే 2: పది, ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేసేలా సీఎం జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని ఆదివారం స్థానిక అంబేద్కర్‌నగర్‌ సమీపంలోని వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో నాయకులు వితనతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా ప్రభావం తీవ్రం కావడంతో మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు. విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమడకుండా పరీక్షలను వాయిదా వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చిన్నా, కార్తీక్‌, ఉపేంద్ర, నిఖిల్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-03T03:19:31+05:30 IST