రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షనా? సెలక్షనా?

ABN , First Publish Date - 2021-02-07T05:03:07+05:30 IST

రాష్ట్రంలో జరుగుతోంది పంచాయతీ ఎలక్షన్లా? ఏకంగా సెలక్షన్లా అని బీజేపీ రాష్ట్ర అధికార పతినిధి భానుప్రకా్‌షరెడ్డి ప్రశ్నించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షనా? సెలక్షనా?

3 ప్రసాద్‌ 6 : మాట్లాడుతున్న భానుప్రకా్‌షరెడ్డి.

ఏకగ్రీవాలపై సీఎం అర్థం చెప్పాలి

బీజేపీ జోలికి వస్తే ఖబడ్దార్‌

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకా్‌షరెడ్డి

నెల్లూరు (వైద్యం)ఫిబ్రవరి 6 : రాష్ట్రంలో జరుగుతోంది పంచాయతీ ఎలక్షన్లా? ఏకంగా సెలక్షన్లా అని బీజేపీ రాష్ట్ర అధికార పతినిధి భానుప్రకా్‌షరెడ్డి ప్రశ్నించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసలు ఏకగ్రీవాలపై అర్థం చెప్పాలన్నారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.  చిత్తూరులో నామినేషన్లు వేస్తున్న బీజేపీ నేతల తలల పగుల గొట్టటం దుర్మార్గమన్నారు. ఆ జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనైతిక వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.   ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు పోవాలి జగన్‌ .. పోతాడు జగన్‌ అంటున్నారన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని, ఎన్నికల కమిషన్‌ను దూషించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు రౌడీయిజం, ఇసుక, మట్టి, మద్యం, మధ్యస్థాలతో దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డీజీపీ రాజకీయ ఉపన్యాసాలు మానుకోవాలని, టీటీడీలో జరుగుతున్న దురాగతాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. రామతీర్థంలో రాముడి తల నరికిన వారిని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదేనన్నారు. బీజేపీతో పెట్టుకుంటే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. బీజేపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అధికారులను బెదిరిస్తూ పోలీసులను పురమాయిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు.  సమావేశంలో బీజేపీ నేతలు ముక్కురాధాకృష్ణగౌడ్‌, మారుతీ కుమార్‌రెడ్డి, వంశీధరరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, మురశీ, మస్తానయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T05:03:07+05:30 IST