పచ్చని చెట్టు నరికివేత

ABN , First Publish Date - 2021-07-17T03:43:30+05:30 IST

ఇందుకూరుపేట పట్టణ నడి బజారులో పాతికేళ్లకు పైగా అందరికి నీడనిచ్చి, స్వేద తీరుస్తున్న పచ్చని చెట్టు ఈరోజు ఇద్దరు వైసీపీ నాయకుల స్వార్థానికి బలైపోయింది.

పచ్చని చెట్టు నరికివేత
నేల కొరిగిన చెట్టు

 వైసీపీ నేతల ఆదాయ వనరుకు బలి


ఇందుకూరుపేట, జూలై 16 : ఇందుకూరుపేట పట్టణ నడి బజారులో పాతికేళ్లకు పైగా అందరికి నీడనిచ్చి, స్వేద తీరుస్తున్న పచ్చని చెట్టు ఈరోజు ఇద్దరు వైసీపీ నాయకుల స్వార్థానికి బలైపోయింది. కేవలం స్వార్థం, ఎవరు   అడగరు అన్న ధీమాతో తల్లిలాంటి ఆ పచ్చని చెట్టు వారికి ఆదాయ వనరుగా మారింది. నడిబజారులో సినిమా హాల్‌ ఎదురుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి విగ్రహం పక్కనే పోలీస్‌ క్వార్టర్స్‌ ఎదురుగా అందులోనూ ఎస్సై ఇంటి ఎదురుగానే ఈ చెట్టును అక్రమంగా నరికివేశారు.  ఈ విషయంపై గ్రామస్థులు ఆర్‌అండ్‌బీ ఇంజనీరుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. తాము పరిశీలిస్తామని వైసీపీ నాయకులు అయినా ఉపేక్షించేది లేదని వారు తెలియజేశారు.  


Updated Date - 2021-07-17T03:43:30+05:30 IST