ఓటీఎస్‌పై అపోహలొద్దు : జేసీ
ABN , First Publish Date - 2021-12-10T04:26:57+05:30 IST
ఏ సచివాలయానికి వెళ్లినా ఓటీఎస్.. ఏ పంచాయతీలోనైనా ఓటీఎస్.. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఓటీఎస్.. అంతా ఓటీఎస్ ధ్యేయంగానే పనిచేస్తున్నారు.

స్వచ్ఛందంగానే కట్టించుకోండి : ఆర్డీవో
మనుబోలు, డిసెంబరు 9: ఏ సచివాలయానికి వెళ్లినా ఓటీఎస్.. ఏ పంచాయతీలోనైనా ఓటీఎస్.. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఓటీఎస్.. అంతా ఓటీఎస్ ధ్యేయంగానే పనిచేస్తున్నారు. దీనిపైనే ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు హడావుడి. ఇందులో భాగంగానే గురువారం గురివిందపూడి సచివాలయాన్ని జేసీ (రెవెన్యూ) హరేందిర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలు ఎలా నింపాలి, దీనిపై అధికారులకు, సచివాలయ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఓటీఎస్‌పై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దన్నారు. అలాగే మడమనూరు సచివాలయాన్ని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్ తనిఖీ చేసి ఓటీఎస్‌పై సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలను బలవంత పెట్టవద్దని, స్వచ్ఛందంగానే వారి నుంచి డబ్బులు కట్టించుకుని రుణవిముక్తి పత్రాలు అందజేయాలని తెలిపారు. కాగా తహసీల్దార్ నాగరాజు జట్లకొండూరు సచివాలయాన్ని తనిఖీ చేసి ఓటీఎస్ లబ్ధిదారులతో మాట్లాడి అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏఈ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.