వైఎస్‌ఆర్‌ బీమా ఆన్‌లైన్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-05-25T03:53:02+05:30 IST

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైఎస్‌ఆర్‌ బీమాలో అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశామని, దీనిని ఆన్‌లైన్‌ చేయడంలో సహకారం అందించాలని ఎంపీడీవో భవాని స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ను కోరారు.

వైఎస్‌ఆర్‌ బీమా ఆన్‌లైన్‌ చేయాలి
వైఎస్‌ఆర్‌ బీమా జాబితాను బ్యాంక్‌ మేనేజర్‌కు అందజేస్తున్న ఎంపీడీవో, సీసీలు

కోట, మే 24 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైఎస్‌ఆర్‌ బీమాలో అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశామని, దీనిని ఆన్‌లైన్‌ చేయడంలో సహకారం అందించాలని ఎంపీడీవో భవాని స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ను కోరారు.  విద్యానగర్‌లోని స్టేట్‌బ్యాంక్‌లో సోమవారం వైఎస్‌ఆర్‌ బీమా అర్హుల ఎంపికపై సమావేశం నిర్వహించారు. బ్యాంక్‌ పరిధిలో 3,725 మంది  అర్హులను గుర్తించామని ఎంపీడీవో తెలిపారు. అందుకు సంబంధించిన జాబితాను మేనేజర్‌ కిరణ్‌కుమార్‌కు అందజేశారు. 

Updated Date - 2021-05-25T03:53:02+05:30 IST