రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-27T04:41:28+05:30 IST

ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి కావలిలో ఉదయగిరి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో జరిగింది.

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య

కావలి రూరల్‌, డిసెంబరు26: ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ  సంఘటన శనివారం రాత్రి కావలిలో ఉదయగిరి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో జరిగింది.  రైల్వే పోలీసుల వివరాల మేరకు పట్టణంలోని రామ్మూర్తిపేట కు చెందిన గణేష్‌ రెడ్డి(22)  ప్రైవేటు ల్యాబ్‌ లో పనిచేస్తూ స్నేహితులతో తిరుగుతూ వ్యసనాలకు బానిసయ్యాడు. తల్లిదండ్రులు తప్పని  వారించడం తో మనస్తాపం చెందిన గణేష్‌ రెడ్డి శనివారం  మధ్యాహ్నం ఇంటి నుంచి  వెళ్లిపోయాడు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా తాను చనిపోతానని చెప్పాడు. కుటుంబసభ్యులు వెతికినా జాడ కానరాలేదు. రాత్రి 9 గంటల సమయం లో దిగువ మార్గం లోని రైలు పట్టాలపై యువకుడు మృతి చెంది ఉండటాన్ని స్టేషన్‌ పాయింట్‌మన్‌ గుర్తించి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు మృతదేహన్ని గుర్తించి బోరున విలపించారు. ఎస్‌ఐ అరుణకుమారి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-12-27T04:41:28+05:30 IST