లారీ ఢీ కొని ఒకరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-12-27T04:31:32+05:30 IST

నాయుడుపేట - మల్లాం కూడలి వద్ద లారీ ఢీ కొనడంతో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

లారీ ఢీ కొని ఒకరికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వీరయ్య

నాయుడుపేట, డిసెంబరు 26 : నాయుడుపేట - మల్లాం కూడలి వద్ద లారీ ఢీ కొనడంతో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. పట్టణంలోని విన్నమాలకు చెందిన వీరయ్య పనులు ముగించుకొని ఆదివారం రాత్రి సైకిల్‌పై పట్టణంలోని ఇంటికి  వెళ్తున్నాడు. నాయుడుపేట - మల్లాం కూడలి వద్ద చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్లే లారీ వీరయ్యను ఢీ కొంది. వీరయ్య చెయ్యి పూర్తిగా నలిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.

Updated Date - 2021-12-27T04:31:32+05:30 IST