లారీ ఢీ కొని ఒకరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-11-24T04:58:22+05:30 IST

నాయుడుపేట మండలం బిరదవాడ జాతీయ రహదారిపై లారీ ఢీ కొన్న సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి

లారీ ఢీ కొని ఒకరికి తీవ్ర గాయాలు

నాయుడుపేట, నవంబరు 23 : నాయుడుపేట మండలం బిరదవాడ జాతీయ రహదారిపై లారీ ఢీ కొన్న సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణానికి చెందిన బాబు, మోహన్‌ మోటారు సైకిల్‌పై సూళ్లూరుపేటకు వెళ్తుండగా నెల్లూరు వైపు నుంచి చెన్నై వెళ్లే లారీ ఢీ కొనడంతో  బాబు తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది క్షతగాత్రుణ్ణి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. 

Updated Date - 2021-11-24T04:58:22+05:30 IST