మోటారు బైక్‌ ఢీ కొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-07-09T05:07:06+05:30 IST

మోటారుబైక్‌ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి పెళ్లకూరులో జరిగింది.

మోటారు బైక్‌ ఢీ కొని వ్యక్తి మృతి
చెంచయ్య మృతదేహం

పెళ్లకూరు, జూలై 8 : మోటారుబైక్‌ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి పెళ్లకూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు కోట మండలం బుల్లావారిపాళెం ఎస్టీకాలనీకి చెందిన ఈగా చెంచయ్య (38) గురువారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి మండలంలోని దొడ్లవారిమిట్ట గ్రామానికి ఒక కార్యం నిమిత్తం  వచ్చాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ రైతును కలవడానికి తన సమీపబంధువుతో కలసి మోటారు బైక్‌పై పెళ్లకూరులోని కొత్తూరుకు వచ్చాడు. చెంచయ్య రైతుతో మాట్లాడి తిరిగి పెళ్లకూరు బస్టాండ్‌కు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటుతుండగా నాయుడుపేట నుంచి బైక్‌పై వెళ్తున్న టెంకాయతోపు గ్రామానికి వెళ్తున్న రఘు ఢీ కొట్టాడు. దీంతో చెంచయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక నాయుడుపేట సీఐ సోమయ్య, ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌,  సిబ్బందితో వచ్చి సంఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య సుగుణమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-07-09T05:07:06+05:30 IST