చికిత ్స పొందుతూ ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-03-23T03:34:32+05:30 IST

మనుబోలుకు చెందిన యరగల మస్తానయ్య (54) అకస్మాత్తుగా వచ్చిన వ్యాధికి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

చికిత ్స పొందుతూ ఒకరి మృతి
యరగల మస్తానయ్య (ఫైల్‌)

కొవిడ్‌ టీకాతోనే మృతి చెందాడంటున్న బంధువులు

కాదంటున్న వైద్యులు

మనుబోలు, మార్చి 22: మనుబోలుకు చెందిన యరగల మస్తానయ్య (54) అకస్మాత్తుగా వచ్చిన వ్యాధికి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అయితే కొవిడ్‌ టీకా  వికటించడం వలనే చనిపోయాడని బంధులు ఆరోపిస్తున్నారు. బంధువుల కథనం మేరకు.. మనుబోలు యాదవవీధికి చెందిన మస్తానయ్య స్థానిక ఓ పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ధీర్ఘకాలిక వ్యాఽధులుండి 60 ఏళ్ల లోపు వయసున్న వారు కొవిడ్‌ టీకా వేసుకోవాలని వైద్యసిబ్బంది చెప్పడంతో శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో మస్తానయ్య కొవిడ్‌ టీకా వేయించుకున్నాడు. శనివారం పరిశ్రమకు డ్యూటీకి వెళ్లాడు. అక్కడ జ్వరం రావడంతో వైద్య సిబ్బంది ఇచ్చిన మందులు వేసుకున్నాడు. సాయంత్రానికి తగ్గకపోగా మూత్రం రాక మరింత బాధపడుతుండడంతో బంధువులు చికిత్స నిమిత్తం గూడూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చేర్చుకునేందుకు ఆసుపత్రి నిర్వాహకులు నిరాకరించడంతో ఆదివారం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి వరకు చికిత్స అందించిన వైద్యులు ఏ కారణం చెప్పకుండా అక్కడి నుంచి అంబులెన్సులో మరో చోటకి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో చేసేదేమి లేక మస్తానయ్యను అక్కడే ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యం చేసేలోగానే ఆయన మృతి చెందాడు. టీకా వేసుకున్న రెండు రోజులకే మస్తానయ్య చనిపోవడంతో బంధువులు, స్థానికులు, కుటుంబ సభ్యులు టీకా వలనే చనిపోయి ఉంటాడని ఆరోపించారు. దీంతో సమాచారం తెలుసుకున్న స్థానిక పీహెచ్‌సీ వైద్యసిబ్బంది మస్తానయ్య ఇంటికి చేరుకుని మస్తానయ్య ఆరోగ్య పరిస్థితి తెలిపే పత్రాలు పరిశీలించి టీకా వలన చనిపోలేదని, ఇతర అనారోగ్యాల వలన చనిపోయారని తేల్చారు. మస్తానయ్యతో పాటు అదే రోజు చాలామందికి టీకా వేశామని, వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, టీకాపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. 

Updated Date - 2021-03-23T03:34:32+05:30 IST