సేవల దిశగా నెల్లూరు రెడ్‌క్రాస్
ABN , First Publish Date - 2021-05-09T04:27:05+05:30 IST
ఎన్నో రకాల సేవల దిశగా నెల్లూరు రెడ్‌క్రాస్ కృషి చేస్తోందని రెడ్‌క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి.

దేశంలోనే ప్రత్యేక గుర్తింపు
రెడ్‌క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు (వైద్యం) మే 8 : ఎన్నో రకాల సేవల దిశగా నెల్లూరు రెడ్‌క్రాస్ కృషి చేస్తోందని రెడ్‌క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పలువురు ప్లాస్మాదానం చేశారు. అలాగే పేదలకు అన్నదానం చేశారు. రెడ్‌క్రాస్‌లో వ్యవస్థాపకుడు హెడ్రీడూనాట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే నెల్లూరు రెడ్‌క్రాస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అలాగే రాష్ట్రంలోనే మెరుగైన వైద్య సేవలు అందించేది నెల్లూరు రెడ్‌క్రాస్ కేన్సర్ ఆసుపత్రేనన్నారు. పల్లిపాడు గాంధీ ఆశ్రమంతో పాటు పలు ప్రాజెక్టులను రెడ్‌క్రాస్ చేపడుతుందని తెలిపారు. గత ఏడాది కరోనా సమయంలో ప్రత్యేక సేవలు అందించిందన్నారు. వలస కూలీలకు మూడు పూటలా ఆహారం అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా ఇలాంటి సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులు భయ్యాప్రసాద్, సురేష్‌జైన్, యడవల్లి సురేష్, రాజేంద్ర పాల్గొన్నారు.