నీటిలో దూకి వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2021-12-27T04:42:31+05:30 IST
ఉదయగిరి పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఆనకట్ట నీటిలో దూకి జయమ్మ (80) మృతి చెందింది

ఉదయగిరి, డిసెంబరు 26: ఉదయగిరి పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఆనకట్ట నీటిలో దూకి జయమ్మ (80) మృతి చెందింది. కొన్నేళ్ళుగా పట్టణంలోని బస్టాండ్ సెంటరులో ఆమె కుమారులతో కలసి టిఫిన్ సెంటరు నడుపుతోంది. ఇటీవల ఆమె అనారోగ్యం పాలైంది. దీంతో నొప్పుల బాధ తట్టుకోలేక నీటిలో దూకి ఆత్మహత్మకు పాల్పడి మృతి చెందింది. తెల్లవారు జామున అటుగా వాకింగ్‌కు వెళ్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే మృత దేహాన్ని ఇంటికి తరలించారు. ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.