మధ్యాహ్నం అయితే ఒక్కరుంటే ఒట్టు..
ABN , First Publish Date - 2021-05-09T03:41:20+05:30 IST
మధ్యాహ్నం 12 కావస్తుందంటే రోడ్లపై జనం ఒక్కరు ఉండడం లేదు. పోలీసులు కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తుండడంతో దుకాణాల

మనుబోలు, మే 8: మధ్యాహ్నం 12 కావస్తుందంటే రోడ్లపై జనం ఒక్కరు ఉండడం లేదు. పోలీసులు కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తుండడంతో దుకాణాల యజమానులు 12కల్లా మూసేస్తున్నారు. జనం ఇళ్లకే పరిమితం కావడంతో గ్రామం అంతా నిర్మానుష్యంగా ఉంది. గ్రామానికి సరిహ మధ్యాహ్నం 12 కావస్తుందంటే రోడ్లపై జనం ఒక్కరు ఉండడం లేదు. పోలీసులు కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తుండడంతో దుకాణాల యజమానులు 12కల్లా మూసేస్తున్నారు. జనం ఇళ్లకే పరిమితం కావడంతో గ్రామం అంతా నిర్మానుష్యంగా ఉంది. గ్రామానికి సరిహద్దులో పోలీసులు కాపలా కాస్తూ రోడ్డుపై మోటార్‌సైకిళ్లపై వస్తున్న వారి వివరాలు సేకరించి పంపుతున్నారు. ఇతర గ్రామాలనుంచి వస్తున్నారా, ఏ కారణంతో వెళుతున్నారని ప్రశ్నించి పంపుతున్నారు. రద్దీగా ఉండే జాతీయరహదారి వాహనాలు రాకపోవడంతో బోసిపోతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నిత్యావసర సరకులు, అత్యవసర వాహనాలు మాత్రమే వెళుతున్నాయి.