సమస్యలపై ఎన్‌ఎంయూ ధర్నా

ABN , First Publish Date - 2021-03-23T04:42:51+05:30 IST

సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోలో నెలకొన్న ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎంయూ నాయకులు డిపో ముందు ఽసోమవారం ధర్నా చేశారు.

సమస్యలపై ఎన్‌ఎంయూ ధర్నా
ధర్నా చేస్తున్న ఎన్‌ఎంయూ నాయకులు

సమస్యలపై ఎన్‌ఎంయూ ధర్నా

సూళ్లూరుపేట, మార్చి 22 : సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోలో నెలకొన్న ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎంయూ నాయకులు డిపో ముందు ఽసోమవారం ధర్నా చేశారు.  గతంలో  ప్రధాన సమస్యలపై సంస్థ కమిషనర్‌తో చర్చలు జరిపినా పరిష్కారం కాలేదన్నారు. ప్రధానంగా ట్రాఫిక్‌ రూట్లలో బస్సులు తిప్పకుండా ఖాళీ రూట్లలో తిప్పుతుండడం వల్ల డిపో ఆదాయం తగ్గిపోతుందన్నారు. మహిళా కండక్టర్ల విశ్రాంత గదులు అధ్వానంగా ఉన్నా, బస్టాండులో ప్రయాణికులకు తాగునీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండు చేశారు. కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు పోలయ్య, భాస్కర్‌, మణ్యం, శశి, లోకనాథం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:42:51+05:30 IST