భక్తిశ్రద్ధలతో నిప్పుల గుండం
ABN , First Publish Date - 2021-08-20T05:04:11+05:30 IST
భక్తిశ్రద్ధలతో నిప్పుల గుండం
బిట్రగుంట, ఆగస్టు 19: మొహర్రం సందర్భంగా బోగోలు మేజర్ పంచాయతీలోని పీర్ల చావిడి వద్ద మూడోరోజు గురువారం ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిప్పుల గుండం తొక్కారు. ఉపవాస దీక్షతో ముస్లింలు పీర్లను ఎత్తుకొని గుండం తొక్కే కార్యక్రమాన్ని చూసేందుకు అధిక సంఖ్యలొ ప్రజలు తరలి వచ్చారు. అనంతరం చదింపులు చేశారు. ప్రసాదం పంచి పెట్టారు.