వారంలో 3 రోజులే నిమ్మమార్కెట్‌

ABN , First Publish Date - 2021-05-14T04:02:22+05:30 IST

కొవిడ్‌ కారణంగా నిమ్మమార్కెట్‌ వారంలో మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.

వారంలో 3 రోజులే నిమ్మమార్కెట్‌
నిమ్మకాయలు

శుక్ర, శని, ఆదివారాల్లో నిర్వహణ


గూడూరురూరల్‌, మే 13 : కొవిడ్‌ కారణంగా నిమ్మమార్కెట్‌ వారంలో మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, జైపూర్‌, బీహార్‌, లక్నో, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో లాక్‌డౌన, పాక్షిక లాక్‌డౌన అమలులో ఉంది. దీంతో గూడూరు నుంచి ఆగిపోయాయి. దీనికితోడు రాష్ట్రంలోనూ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే మార్కెట్‌ నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిమ్మధరలు కాయసైజును బట్టి కేజీ రూ.20 నుంచి రూ.50 వరకు ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.

Updated Date - 2021-05-14T04:02:22+05:30 IST