నిధులు మావి.. ప్రచారం రాష్ట్రానిదా !

ABN , First Publish Date - 2021-08-22T03:52:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తుండగా, ఆ పథకాలను తమవిగా రాష్ట్రం ప్రచారం చేసుకోవడం బాధాకరమని నెల్లూరు జిల్లా బీజేపీ కార్యదర్శి, విస్తారక్‌ ప్రశాంత్‌రాజ్‌ అన్నారు.

నిధులు మావి.. ప్రచారం రాష్ట్రానిదా !

కోట, ఆగస్టు 21 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తుండగా,  ఆ పథకాలను తమవిగా రాష్ట్రం ప్రచారం చేసుకోవడం బాధాకరమని నెల్లూరు జిల్లా  బీజేపీ కార్యదర్శి, విస్తారక్‌ ప్రశాంత్‌రాజ్‌ అన్నారు. మండల పరిధిలోని సిద్ధవరంలో శనివారం బీజేపీ సంక్షేమ పథకాలపై ఆయనతోపాటు బీజేపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో బీజేపీ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అయితే ప్రతి పథకాన్ని తామే ప్రవేశపెట్టినట్లుగా రాష్ట్ర అధికార పార్టీ చెప్పుకోవడం దారుణమన్నారు. ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సైనికుడిలా పని చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తలు కీలకంగా వ్యవహరించా లన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ సారంగం రమేష్‌బాబు, ఇంతియాజ్‌, అంబరీషా, వాసు, పరుశురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T03:52:41+05:30 IST