నెల్లూరును ‘ స్వచ్ఛ’ంగా ఉంచుదాం!

ABN , First Publish Date - 2021-11-01T04:46:40+05:30 IST

నెల్లూరును స్వచ్ఛంగా ఉంచుదామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి. అనిల్‌కుమార్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

నెల్లూరును ‘ స్వచ్ఛ’ంగా ఉంచుదాం!
డస్ట్‌బిన్లు అందజేస్తున్న మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి

 డస్ట్‌బిన్ల పంపిణీలో మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి 

నెల్లూరు (సిటీ), అక్టోబరు 31 :  నెల్లూరును స్వచ్ఛంగా ఉంచుదామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి. అనిల్‌కుమార్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌తో కలిసి ప్రజలకు డస్ట్‌ బిన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నెల్లూరును సుందరంగా మార్చడంలో పౌరులు తమ బాధ్యతను గుర్తెరగాలన్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లు పరిసర ప్రాంతాలను కూడా అలాగే ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛ నెల్లూరు స్థాపనకు ప్రతి నగర వాసి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛ నెల్లూరు పై వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించి విజేతలకు రూ. 50, 30, 20 వేలు చొప్పున  అందజేస్తామన్నారు. ఇందుకు నవంబరు 15 వరకు రిజిస్ర్టేషన్‌లు కార్పొరేషన్‌ కార్యాలయంలో కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్‌వో వెంకరమణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T04:46:40+05:30 IST