రికార్డింగ్ డాన్స్‌తో ఎంజాయ్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..

ABN , First Publish Date - 2021-12-31T20:30:58+05:30 IST

నేతలు ఉచ్ఛనీచాలు మరిచిపోతున్నారు. ప్రజలకు మంచి నేర్పించాల్సిన నాయకులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు.

రికార్డింగ్ డాన్స్‌తో ఎంజాయ్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..

నెల్లూరు: నేతలు ఉచ్ఛనీచాలు మరిచిపోతున్నారు. ప్రజలకు మంచి నేర్పించాల్సిన నాయకులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. చేయకూడని చోట.. చేయకూడని పనులతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఏపీలోని వైసీపీ నేతల్లో ఈ ట్రెండ్ మరింత ఎక్కువయ్యింది. పైగా అధికారులను భాగస్వాములను చేసి వాళ్లకి హీటెక్కిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో విపక్షాలు మీడియాపై చిందులువేసే ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రికార్డు డ్యాన్సులకు సాక్షిగా నిలిచారు. పైగా వారిని వారించే ప్రయత్నం కూడా చేయలేదు. రాజుపాలెంలోని ప్రసన్నకుమార్ ముఖ్య అనుచరుడి గెస్టు హౌస్‌లో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు వేయించారు.

Updated Date - 2021-12-31T20:30:58+05:30 IST