నెల్లూరు జిల్లాలో పెట్రోల్‌ బంకుల వద్ద టీడీపీ ధర్నా

ABN , First Publish Date - 2021-11-09T21:20:05+05:30 IST

నెల్లూరు: జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో పెట్రోల్‌ బంకుల వద్ద టీడీపీ ధర్నా

నెల్లూరు: జిల్లాలో పెట్రోల్‌ బంకుల వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నాయుడుపేట మేనకూరు పెట్రోల్ బంక్ ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు. సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ నెలవల  సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

Updated Date - 2021-11-09T21:20:05+05:30 IST