నెల్లూరు జిల్లా: బుచ్చినగర పంచాయతీలో వైసీపీ నేతల అరాచకం.. బూతు పంచాంగం ఆడియో వైరల్..

ABN , First Publish Date - 2021-11-09T16:50:28+05:30 IST

నెల్లూరు జిల్లా: బుచ్చినగర పంచాయతీలో అధికారపార్టీ అచాచకాలకు తెరతీసింది.

నెల్లూరు జిల్లా: బుచ్చినగర పంచాయతీలో వైసీపీ నేతల అరాచకం.. బూతు పంచాంగం ఆడియో వైరల్..

నెల్లూరు జిల్లా: బుచ్చినగర పంచాయతీలో అధికారపార్టీ అచాచకాలకు తెరతీసింది. అభ్యర్థులను, వారి వెంట ఉండే నేతలను వైసీపీ శ్రేణులు వేధిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. బుచ్చిలో 4వ వార్డులో టీడీపీ తరఫున కుప్ప భారతి నామినేషన్ వేశారు. స్థానిక వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆమె పక్క ఊరులో తలదాచుకున్నారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు సూరా శ్రీనివాసులు రెడ్డి రెచ్చిపోయారు. ఆమెకు అండగా ఉన్న మెట్టు విజయకృష్ణారెడ్డికి ఫోన్ చేసి బూతుల పంచాంగంతో బెదిరించారు. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


మరోవైపు వైసీపీ నేతల వేధింపులు భరించలేక టీడీపీ అభ్యర్థి భారతి తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఒక్కో వార్డులో నలుగురైదుగురితో నామినేషన్లు వేయించడం ద్వారా వైసీపీ దొంగ దెబ్బలను తిప్పికొట్టారు. ఇదే క్రమంలో శ్రీనివాసులు రెడ్డి బూతుల పంచాంగంతో కూడిన బెదిరింపుల ఆడియో వైరల్‌గా మారింది.


Updated Date - 2021-11-09T16:50:28+05:30 IST