నెల్లూరు: కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత..

ABN , First Publish Date - 2021-06-22T20:37:12+05:30 IST

నెల్లూరు: కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

నెల్లూరు: కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత..

నెల్లూరు: కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు  672 మద్యం బాటిళ్లు, వాహనాన్ని సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా, కొడవలూరు మందసరిపాలెంలో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 1,10,000 విలువ చేసే మద్యం, రూ. 40, 300 నగదు స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-06-22T20:37:12+05:30 IST