నేటి నుంచి తిరుపతి ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

ABN , First Publish Date - 2021-03-24T13:51:52+05:30 IST

తిరుప‌తి ఉపఎన్నిక‌కు క‌లెక్ట‌రేట్లో నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ జరుగనుంది. అభ్య‌ర్ధుల రాక సంద‌ర్బంగా క‌లెక్ట‌రేట్ ఎదుట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

నేటి నుంచి తిరుపతి ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

నెల్లూరు: తిరుప‌తి ఉపఎన్నిక‌కు క‌లెక్ట‌రేట్లో నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ జరుగనుంది. అభ్య‌ర్ధుల రాక సంద‌ర్బంగా క‌లెక్ట‌రేట్ ఎదుట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. క‌రోనా నిబంధ‌న‌ల నేప‌థ్యంలో త‌క్కువ మందితో నామినేష‌న్ దాఖ‌లు చేసుకోవాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. 9 గంటలకు తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మీ నామినేషన్ వేయనున్నారు. వీఆర్సీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం  పనబాక లక్ష్మీ ర్యాలీగా కలెక్టరేట్ చేరుకోనున్నారు. పనబాక లక్ష్మీ నామినేషన్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి టీడీపీ కార్యకర్తలు  చేరుకుంటున్నారు. 

Updated Date - 2021-03-24T13:51:52+05:30 IST