హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2021-01-21T02:55:16+05:30 IST
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు వివరాలను ట్రైనీ ఎస్పీ మహేశ్వరరెడ్డి వె

నాయుడుపేట టౌన్, జనవరి 20 : హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు వివరాలను ట్రైనీ ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. నాయుడుపేట సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు, బాధితురాలు గౌరీకి వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో ఆమె భర్త రామ్‌కుమార్ మంగళవారం కత్తితో గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన విదితమే. బాధితురాలు గౌరీ ఇంట్లో ఉండగా ఆమె భర్త రామ్‌కుమార్, కుమారుడు కలసి ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లి తలుపులు మూసివేసి తాళంవేసి కత్తితో గౌరీపై దాడిచేసి గొంతు, గడ్డం, చేతులపైన గాయపరచినట్లు తెలిపారు. ఈ మేరకు రామ్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును 24 గంటలలోగా ఛేదించి, నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన సీఐ వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో నాయుడుపేట అదనపు ఎస్‌ఐ బాలకృష్ణయ్య, హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతయ్య, సిబ్బందిని ట్రైనీ ఎస్పీ మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు .