దుర్గాదేవిగా పార్వతీదేవి దర్శనం

ABN , First Publish Date - 2021-10-08T03:44:41+05:30 IST

మండలంలోని ఉదయగిరి, దుర్గంపల్లి గ్రామాలలో గురువారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

దుర్గాదేవిగా పార్వతీదేవి దర్శనం
ఉదయగిరి : ప్రత్యేక అలంకరణలో పార్వతిదేవి

ఉదయగిరి, అక్టోబరు 7: మండలంలోని ఉదయగిరి, దుర్గంపల్లి గ్రామాలలో గురువారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయగిరి శివాలయంలో పార్వతిపరమేశ్వర్లును ప్రత్యేకంగా అలంకరించారు. పార్వతీదేవి స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గంపల్లిలో ఉదయలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అర్చకుడు అనిల్‌శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. 

భద్రకాళికి పంచామృతస్నపన అభిషేకాలు

కలిగిరి, అక్టోబరు 7: మండలంలోని తెల్లపాడు గ్రామంలో శ్రీ భద్రకాళిఅమ్మవారికి గురువారం జరిగినపంచామృతస్నపన అభిషేకాలు, పూజాకార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.  అదేవిధంగా అమ్మవారు బాలత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. Updated Date - 2021-10-08T03:44:41+05:30 IST