నాటుసారాపై అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2021-10-15T03:09:36+05:30 IST

మండలంలోని బిరదవోలులో గురువారం నాటుసారాపై అవగాహన సదస్సు నిర్వహించారు.

నాటుసారాపై అవగాహన సదస్సు
గ్రామంలో అవగాహన కల్పిస్తున్న పోలీసు, సెబ్‌ అధికారులు

పొదలకూరు, అక్టోబరు 14 : మండలంలోని బిరదవోలులో గురువారం నాటుసారాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ (సెబ్‌) జానకిరామ్‌, పొదలకూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగమేశ్వరరావు, ఎస్‌ఐ కరీముల్లా, రాపూరు ఎక్సైజ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. నాటుసారా తయారు చేయడం, అమ్మడం గానీ, రవాణా చేయడం గానీ చేయకూడదని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అలాగే బిరదవోలులో,  చుట్టుపక్కల గ్రామాల్లో నాటుసారా తయారీ చేయబోమని గ్రామస్థుల చేత ప్రమాణం చేయించారు.  

Updated Date - 2021-10-15T03:09:36+05:30 IST