వైభవంగా నారాయణ పేరంటాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2021-08-24T04:11:13+05:30 IST
మండలంలోని కోటపోలూరు గ్రామంలో నిర్మించిన నారాయణ పేరంటాలమ్మ దేవస్థానంలో సోమవారం ఉదయం అమ్మణ్ణి విగ్రహాప్రతిష్ఠ జరిగింది.
సూళ్లూరుపేట, ఆగస్టు 23 : మండలంలోని కోటపోలూరు గ్రామంలో నిర్మించిన నారాయణ పేరంటాలమ్మ దేవస్థానంలో సోమవారం ఉదయం అమ్మణ్ణి విగ్రహాప్రతిష్ఠ జరిగింది. అనంతరం ఆలయ విమాన శిఖరంపై కలశస్థాపన చేశారు. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యహః, బింబప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ, విమానశిఖరంపై కలశస్థాపనలతో కుంభాభిషేక కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఉభయ కర్తలుగా ఆరణి విజయభాస్కర్‌రెడ్డి - సుజాత, కొండమరెడ్డి అనిల్‌కుమార్‌రెడ్డి - సరిత వ్యవహరించారు. సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠకు హాజరయ్యారు.