స్వర్ణ గరుడపై నృసింహుడి చిద్విలాసం

ABN , First Publish Date - 2021-11-06T04:28:04+05:30 IST

పెంచలనృసింహుడి స్వాతి జన్మ నక్షత్ర వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం మూలవిరాట్‌కు చందనాలంకారం చేసి విశేష అభిషేకాలు, పూజలు చేశారు.

స్వర్ణ గరుడపై నృసింహుడి చిద్విలాసం
స్వర్ణగరుడపై నృసింహుడు

కోనలో వేడుకగా శ్రీవారి జన్మనక్షత్ర వేడుకలు

రాపూరు, నవంబరు 5: పెంచలనృసింహుడి స్వాతి జన్మ నక్షత్ర వేడుకలను శుక్రవారం  వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం మూలవిరాట్‌కు చందనాలంకారం చేసి విశేష అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం శ్రీవార్లను పల్లకిపై వేంపేసి శాంతిహోమం నిర్వహించారు. సాయంత్రం బంగారు గరుడ వాహనంపై శ్రీవారిని కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ఆదిలక్ష్మి అమ్మవారికి ఆస్థానసేవ నిర్వహించారు.Updated Date - 2021-11-06T04:28:04+05:30 IST