ఉద్దేశ పూర్వకంగా నామినేషన్ల తిరస్కరణ
ABN , First Publish Date - 2021-02-02T02:51:24+05:30 IST
మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ సర్పంచుగా పోటీ చేయాలనే ఉద్దేశంతో తాము స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దా

పొంతన లేని సమాధానాలు చెప్తున్న అధికారులు
అల్లూరు, ఫిబ్రవరి 1 : మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ సర్పంచుగా పోటీ చేయాలనే ఉద్దేశంతో తాము స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశామని, అయితే అధికారులు ఉద్దేశ పూర్వకంగానే తమ నామినేషన్లను తిరస్కరించారని అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన మైపాటి సుబ్రహ్మణ్యం, పుచ్చలపల్లి శీనయ్యలు తెలిపారు. సోమవారం ఎన్నికల అధికారులు నిర్వహించిన పరిశీలనలో భాగంగా తమ పేర్లను ముందుగా జాబితాలో పొందుపరచి కార్యాలయం నోటీసు బోర్డులో ఉంచారన్నారు. మరలా నాయకుల వద్ద నుంచి వచ్చిన ఆదేశాలతో నిర్ణయాలు తీసుకొని తమ పేర్లను జాబితాలో నుంచి తొలగించారని వారు పేర్కొన్నారు. ఏ కారణంతో తమ పేర్లను తొలగించారని అధికారులను ప్రశ్నించగా ఎస్సీ కేటగిరి కింద శంభన్ కులస్థులు లేరని దీంతో తాము తిరస్కరించామని తేల్చి చెప్పారన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని, ఇందులో తాము సొంత నిర్ణయం ఏదీలేదని అధికారులు స్పష్టం చేశారు.