న్యాక్‌ మూల్యాంకనం తప్పనిసరి చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T03:49:09+05:30 IST

ఉన్నత విద్యా సంస్థలకు న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిటేషన్‌ కమిటీ) మూల్యాంకనం తప్పనిసరి చేయాలని అఖిల భా

న్యాక్‌ మూల్యాంకనం తప్పనిసరి చేయాలి
- న్యాక్‌ డైరెక్టర్‌ ఎస్‌సీ శర్మకు వినతిపత్రం ఇస్తున్న రామిరెడ్డి


వెంకటాచలం, డిసెంబరు 30: ఉన్నత విద్యా సంస్థలకు న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిటేషన్‌ కమిటీ) మూల్యాంకనం తప్పనిసరి చేయాలని అఖిల భారతీయ రాష్ర్టీయ సైక్షిక్‌ మహా సంఘ్‌ (ఏబీఆర్‌ఎస్‌ఎం) రాష్ట్ర కన్వీనర్‌ వైవీ రామిరెడ్డి కోరారు. గురువారం బెంగళూరులోని న్యాక్‌ ప్రధాన కార్యాలయం లో డైరెక్టర్‌ ఎస్‌సీ శర్మను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు న్యాక్‌ చేస్తున్న కృషి ఎంతో విలువైనదన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న నూతన జాతీయ విద్యా విధానం పటి ష్టంగా అమలు చేసేదాని కోసం ఏబీఆర్‌ఎస్‌ఎం తరుపున ఐదు అంశాలతో కూడిన ప్రతిపాదనలను అందజేసినట్లు తెలిపారు.  న్యాక్‌ డైరెక్టర్‌ ఎస్‌సీ శర్మ స్పందిస్తూ త్వరలో జరగనున్న న్యాక్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనల పై చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని  హామీ ఇచ్చినట్లు రామిరెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-31T03:49:09+05:30 IST