నాణ్యమైన భోజనం అందించాలి : ఎంపీపీ

ABN , First Publish Date - 2021-12-10T03:16:58+05:30 IST

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. ఆమె గురువారం స్థానిక ఆదర్శ పాఠశా

నాణ్యమైన భోజనం అందించాలి : ఎంపీపీ
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎంపీపీ పద్మావతి

సీతారామపురం, డిసెంబరు 9: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. ఆమె గురువారం స్థానిక ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, నీటి వసతిపై ఆరా తీశారు. విద్యార్థులు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆమె వారం రోజుల్లో ఆ సమస్య తీరుస్తామన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.  అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీపీని సన్మానించా రు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మస్తాన్‌వలి, మండల వైసీపీ కన్వీనర్‌ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 


 అక్షరాస్యత శాతాన్ని పెంపొందించాలి


మండలంలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి పేర్కొన్నారు. ఆమె గురు వారం స్థానిక అక్షరవెలుగు విద్యా ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చెరుకుపల్లి రమణారెడ్డి, మండల వైసీపీ కన్వీనర్‌ సుబ్బారెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు చప్పిడి తిరుపతిరెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్‌ రామ్మోహన్‌రావు, మండల కో ఆర్డినేటర్లు ఎంవీ సుబ్బమ్మ, హైమావతి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-10T03:16:58+05:30 IST