నాడు-నేడు పనులు వెంటనే పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-02-07T02:55:51+05:30 IST
మండలంలోని 19 పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు వెంటనే పూర్తి చేయాలని ఎంఈవో దిలీప్‌కుమార్ హెచ్‌ఎంల

బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి6: మండలంలోని 19 పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు వెంటనే పూర్తి చేయాలని ఎంఈవో దిలీప్‌కుమార్ హెచ్‌ఎంలను కోరారు. శనివారం బుచ్చి మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈవో అధ్యక్షతన ఈఈ ఆనందరెడ్డి, డీఈ రాధాకృష్ణ పాఠశాలల హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెయింటింగ్ పనుల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలని కోరారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని వారు కోరారు.