ముత్తుకూరు బీసీకాలనీలో చోరీ

ABN , First Publish Date - 2021-05-03T03:26:09+05:30 IST

ముత్తుకూరు బీసీ కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక బీసీ కాలనీ మసీదు వీధిలో నివాసం ఉంటున్న పుచ్చలపల్లి శ్రీదేవి, ప్రేమ్‌రాజ్‌ల ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున చోరీకి పాల్పడ్దారు.

ముత్తుకూరు బీసీకాలనీలో చోరీ

ముత్తుకూరు, మే 2: ముత్తుకూరు బీసీ కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక బీసీ కాలనీ మసీదు వీధిలో నివాసం ఉంటున్న పుచ్చలపల్లి శ్రీదేవి, ప్రేమ్‌రాజ్‌ల ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున చోరీకి పాల్పడ్దారు. మొదటి అంతస్తులో దంపతులు శనివారం రాత్రి నిద్రిస్తుండగా, కింది అంతస్తులో గ్రిల్స్‌ తొలగించి, బీరువాలో ఉన్న రూ.25వేల నగదు, పక్కనే ఉన్న రెండు సెల్‌ఫోన్లతో పాటు, ఇంటి బయట ఉన్న ఎఫ్‌జడ్‌ మోటారుబైక్‌ను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముత్తుకూరు ఎస్‌ఐ అంజిరెడ్డి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-05-03T03:26:09+05:30 IST